ఉరవకొండ: అనారోగ్య బాధితులని పరామర్శించిన వైయస్సార్సీపి పిఎసి సభ్యులు వై విశ్వేశ్వర్ రెడ్డి
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన పలువురు అనారోగ్య బాధితులు శుక్రవారం అనంతపురంలోని వివిధ ప్రైవేటు ఆసుపత్రులలో అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న వైయస్సార్సీపి పీఏసీ సభ్యులు నియోజకవర్గ ఇంచార్జ్ వై విశ్వేశ్వర్ రెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వీరన్నలు ఆసుపత్రులకు వెళ్లి పరామర్శించారు. అనారోగ్య బాధితులు త్వరితగతిన కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.