ప్రకాశం జిల్లా మార్కాపురం సర్కిల్ పరిధిలో మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సుబ్బారావు హెచ్చరించారు. డ్రైవింగ్ నిబంధనలు తెలియక మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాల గురవుతున్నట్లు గుర్తు చేశారు. పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేస్తామన్నారు. ఇప్పటికే మైనర్లకు కౌన్సెలింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. మైనర్లు వాహనాలు నడుపుతూ ఎక్కువసార్లు పట్టుబడితే వాహనాలను సిజ్ చేస్తామన్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.