ఉరవకొండ: బెలుగుప్ప మండల వ్యాప్తంగా మహానేత వైఎస్సార్ 77వ జయంతి కార్యక్రమాలు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల వ్యాప్తంగా గ్రామాల్లో మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి కార్యక్రమాలను పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు అభిమానులు కలసి బుధవారం నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా మండలంలోని బెలుగుప్ప రామసాగరం నక్కలపల్లి బెలుగుప్ప తండా, యలగల వంక, రమనేపల్లి తదితర గ్రామాల్లో వైయస్సార్ విగ్రహాలకు చిత్రపటాలకు నివాళులర్పించి, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కేకులను కత్తిరించి వేడుక జరుపుకున్నారు.