సంతనూతలపాడు: వసతి గృహాల్లో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి: సంతనూతలపాడు లో జిల్లా మలేరియా అధికారి మధుసూదన్ రావు
అసంత నూతలపాడు లోని ప్రభుత్వ వసతిగృహాల్లో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా మలేరియా అధికారి మధుసూదన్ రావు సూచించారు. సంతనూతలపాడు లోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో మంగళవారం ఆయన స్వయంగా దోమల నివారణ కోసం యాంటీ లార్వా మందులు పిచికారి చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... దోమ కాటు వల్ల డెంగ్యూ, మలేరియా వ్యాధులు సోకుతాయన్నారు. దోమలు కుట్టకుండా విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వసతిగృహ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వసతి గృహ వార్డెన్ కు ఆయన సూచించారు.