వికారాబాద్: మోరంగ పల్లిలో ఆర్టీసీ బస్సు ఎక్కబోయిఅదుపు తప్పి వెనుక చక్రాలు కింద పడడంతో కడిచెర్లకు చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలు
వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం మరొక పల్లి గ్రామంలో ఆర్టీసీ బస్సు ఎక్కబోయి అదుపుతప్పి, బస్సు వెనక చక్రాల కింద పడ్డ కడిచెర్ల గ్రామానికి చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కడిచర్ల గ్రామానికి చెందిన వ్యక్తి మోరంగ పల్లి వద్ద కడిచర్ల గ్రామానికి వచ్చే ఆర్టీసీ బస్సు ఎక్కబోతుండగా సడన్గా ఆర్టీసీ బస్సు ముందుకు కదలడంతో అదుపుతప్పి వెనుక చక్రాల కింద పడడంతో రెండు కాళ్లు విరిగాయని, ప్రథమ చికిత్స నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.