వికారాబాద్: మార్చి 9న జిల్లా కోర్టులో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా ప్రిన్సిపల్ జడ్జి సుదర్శన్
మార్చి 9న వికారాబాద్ జిల్లా కోర్టులో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రిన్సిపల్ జడ్జి సుదర్శన్ తెలిపారు. జిల్లాలోని కోర్టులో పెండింగ్‌లో ఉన్న సివిల్ కేసులు, మోటార్ ఆక్సిడెంట్ నష్టపరిహారం కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కారం కొరకు కృషి చేయాలని అన్నారు. మంగళవారం వికారాబాద్ బార్ అసోసియేషన్ హాల్‌లో న్యాయ సేవ అధికార సంస్థ వికారాబాద్ న్యాయవాదులతో, బ్యాంక్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రమాద బీమా కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కారం కొరకు ఇన్సూరెన్స్ కంపెనీ పానెల్ న్యాయవాదులు కృషి చేయాలని కోరారు.