వికారాబాద్: ఫిబ్రవరి 28 నుంచి గ్రామీణ మహిళలకు కాస్ట్యూమ్ ఇమిటేషన్, 1 గ్రా. జ్యువలరీ తయారీలో ఉచిత శిక్షణ: లీడ్ బ్యాంక్ మేనేజర్
వికారాబాద్ జిల్లా గ్రామీణ మహిళలకు కాస్ట్యూమ్స్ ఇమిటేషన్, వన్ గ్రామ్ జ్యువలరీ తయారీలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు లీడ్ బ్యాంకు మేనేజర్ రాంబాబు ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు. యూనియన్ బ్యాంక్, జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్, స్వర్ణ భారత్ ట్రస్ట్ సంయుక్తంగా ఫిబ్రవరి 28 నుంచి 13 రోజుల పాటు ఉచితంగా ఈ శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు.