వికారాబాద్: పదవ తరగతి పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకూడదు: విద్యాధికారుల సమావేశంలో జిల్లా కలెక్టర్ నారాయణ
వికారాబాద్ జిల్లాలో జరిగే పదవ తరగతి పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా సజావుగా నిర్వహించేందుకు చీఫ్ సూపర్డెంట్లు పూర్తి బాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో చీఫ్ సూపర్డెంట్లు,మండల విద్యాధికారులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ, జిల్లాలో జరిగే పదవ తరగతి పరీక్షల నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్స్, వాచ్,ఎలక్ట్రానిక్, వస్తువులను అనుమతించరాదని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు.