కనిగిరి: జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించాలని కలెక్టర్ విజయ సునీతను కోరిన కనిగిరి డివిజన్ ప్రెస్ క్లబ్ ప్రతినిధులు
కనిగిరి: మార్కాపురం జిల్లాలో పనిచేస్తున్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీతను కనిగిరి డివిజన్ ప్రెస్ క్లబ్ సభ్యులు కోరారు. ఈ మేరకు సోమవారం మార్కాపురంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వినతి పత్రాన్ని వారు సమర్పించారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్యను అందించే విధంగా పాఠశాలల యాజమాన్యాలను ఆదేశిస్తూ సర్కులర్ జారీచేయాలని కోరారు. ప్రెస్ క్లబ్ ప్రతినిధుల వినతిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ అందుకు సంబంధించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.