రాప్తాడు: సోముల దొడ్డి బిజెపి జిల్లా కార్యాలయంలో ఓబీసీ యువమోర్చా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లో సోమలదొడ్డి బిజెపి జిల్లా కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో బిజెపి జిల్లా ఓబిసి యువమోర్చా కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఓబిసి యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర తదితరులు మాట్లాడుతూ బిజెపి ఓబీసీ యువమోర్చా కార్యవర్గం సమావేశం నిర్వహించి భవిష్యత్తులో నిర్వహించబోయే కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో పటిష్టత గురించి చర్చించడం జరిగిందని ఓబిసి యువమోర్చారాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర పేర్కొన్నారు.