రాప్తాడు: చిన్మయి నగర్ జెఎన్టియు విశ్వవిద్యాలయంలో బి ఫార్మసీ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసిన డైరెక్టర్ నాగప్రసాద్ నాయుడు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లో చిన్మయ నగర్ జెఎన్టియు విశ్వవిద్యాలయంలో శనివారం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో డైరెక్టర్ ఆఫ్ వాల్యూవేషన్ నాగు ప్రసాద్ నాయుడు ఫిబ్రవరి నెలలో నిర్వహించిన బీ ఫార్మసీ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ వాల్యుయేషన్ నాగప్రసాద నాయుడు మాట్లాడుతూ జేఎన్టీయూ విశ్వవిద్యాలయ పరిధిలో ఫిబ్రవరి నెలలో నిర్వహించిన ఎం ఫార్మసీ, బి ఫార్మసీ, రెగ్యులర్ సప్లమెంటరీ పరీక్షా ఫలితాలను విడుదల చేయడం జరిగిందని పూర్తి వివరాల కోసం జెఎన్టియు వెబ్ సైట్లను కానీ ఎగ్జామినేషన్ సెక్షన్ ను సంప్రదించాలని డైరెక్టర్ ఆఫ్ వాల్యుయేషన్ నాగ ప్రసాద్ నాయుడు తెలిపారు.