సంతనూతలపాడు: చిలకలూరిపేట మండలం ఎడవల్లి వద్ద చీమకుర్తికి చెందిన న్యాయవాది శ్రీరామ్ హరిప్రసాద్ దారుణ హత్య
చీమకుర్తి: చిలకలూరిపేట మండలం ఎడవల్లి వద్ద ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన న్యాయవాది శ్రీరామ్ హరి ప్రసాద్ గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో శుక్రవారం దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు హరిప్రసాద్ ఒంగోలు కోర్టులో బార్ అసోసియేషన్ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఎడవల్లి వద్ద హత్యకు గురైన శ్రీరామ్ హరి ప్రసాద్ మృతదేహంపై స్కూటీని పడవేసి ఉండగా, ఆ స్కూటీని పోలీసులు తొలగించి మృతదేహాన్ని వెలికి తీశారు. స్థానిక ఎస్సై అనిల్ కేసు నమోదు చేసుకొని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.