కనిగిరి: పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి పల్లకి సేవ కార్యక్రమం
కనిగిరి పట్టణం లో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి పల్లకి సేవ కార్యక్రమాన్ని శనివారం వేదపండితుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పల్లకి సేవా కార్యక్రమంలో స్వయంగా పాల్గొని, స్వామివారి పల్లకిని మోసి, కొబ్బరికాయలు కొట్టి, హారతులు పట్టి పూజలు చేశారు. కార్యక్రమం అనంతరం భక్తులకు ఆశీర్వచనాలను అందజేసిన పండితులు స్వామివారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.