సంతనూతలపాడు: నాగులుప్పలపాడు మండలం అమ్మనుబ్రోలు రైల్వే గేట్ నేటి నుండి క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించిన అధికారులు
నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు రైల్వే గేటు నేటి నుండి మూసి వేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు సోమవారం తెలిపారు. కనపర్తి రహదారిలో ఉన్న రైల్వే గేట్ అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చేవరకు రైల్వే గేటు తెరవడం జరగదన్నారు. ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలను కొనసాగించాలని వాహనదారులు, స్థానిక ప్రజలకు వారు సూచించారు.