సంతనూతలపాడు: చీమకుర్తి పట్టణంలో ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు
చీమకుర్తి పట్టణంలోని ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎలువల దుకాణాలలో రిజిస్టర్లు, స్టాకును ఆయన పరిశీలించారు. ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాలని ఎరువులు దుకాణాల యజమానులను శ్రీనివాసరావు ఆదేశించారు. ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టించకుండా, అక్రమంగా నిల్వలు ఉంచకుండా, బ్లాక్ మార్కెటింగ్ చర్యలకు పాల్పడకుండా ఉండాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.