కొండపి: కొండపి సర్కిల్ పరిధిలోని పోలీసులకు డ్రిల్ నిర్వహించిన సీఐ సోమశేఖర్
కొండపి సర్కిల్ పరిధిలోని పోలీసులతో శనివారం కొండపి పోలీస్ స్టేషన్లో సీఐ సోమశేఖర్ డ్రిల్ నిర్వహించారు. పోలీస్ సిబ్బంది ఖచ్చితంగా శారీరక వ్యాయామం చేయాలని, క్రమశిక్షణతో మెలగాలని, కేసు పరిశోధనలో సాంకేతికతను ఉపయోగించుకోవాలని అన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులు పట్ల మర్యాదగా వ్యవహరించాలని కోరారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.