కొండపి: టంగుటూరు- సింగరాయకొండ రైల్వే లైన్ మధ్యలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
టంగుటూరు- సింగరాయకొండ రైల్వే లైన్ మధ్యలో గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు శుక్రవారం గమనించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వయస్సు 30 -35 సం.ల మధ్య ఉండొచ్చని జీఆర్పి ఎస్ఐ మధుసూదన్ రావు తెలిపారు.