కొండపి: పొన్నలూరు మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం
పొన్నలూరు మండలంలో శనివారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా వర్షం పడటంతో ఆరబోసిన మిరపకాయలు, బయట ఉన్న పొగాకు చెక్కులు తడిచినట్లు రైతులు తెలిపారు. అక్కడక్కడా చెట్లు ఈదురుగాలులకు నేలకొరిగినట్లు సమాచారం.