కొండపి: తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నుముకలు: మంత్రి స్వామి
ఒంగోలులో జ్యోతిరావు ఫూలే విగ్రహానికి మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, సత్య కుమార్, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, టూరిజం ఛైర్మన్ నూకసాని బాలాజీ, కలెక్టర్ తమీమ్ అన్సారియా శుక్రవారం నివాళులు అర్పించారు. మంత్రి స్వామి మాట్లాడుతూ.. టీడీపీకి బీసీలే వెన్నెముకలని అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జగన్ బీసీలకు చేసిందేమీ లేదన్నారు. ఫూలే సిద్ధాంతాలు, ఆశయాలకనుగుణంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారన్నారు