రాప్తాడు: యాడికి లో సీఎం చంద్రబాబుకు పేరూరు డ్యాంకు 46 కోట్లు నిధులు విడుదల చేయాలని వినిత పత్రం ఇచ్చిన ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సోమవారం 12 30 నిమిషాల సమయంలో యాడికి గ్రామానికి పర్యటనకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును హెలిప్యాడ్ వద్ద కలిసి పుష్పగుచ్చ అందజేసి జిల్లాకు స్వాగతం పలికి పేరూరు డ్యాంకు 46 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయాలని వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ యాడికి లో చంద్రబాబు నాయుడు ను కలిసి పేరూరు డ్యామ్ కాలువ నిర్మాణానికి భూములు కోల్పోయిన రైతుల నష్టపరారం కోసం 46 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కోరడం జరిగిందన ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.