రాప్తాడు: చిన్మయినగర్ JNTU లో బీటెక్ ఎంటెక్ పరీక్ష ఫలితాలను విడుదల చేసిన JNTU డైరెక్టర్ ఆఫ్ వాల్యూవేషన్ నాగ ప్రసాద్ నాయుడు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లో జెఎన్టియు విశ్వవిద్యాలయంలో గురువారం సాయంత్రం నాలుగు గంటల 15 నిమిషాల సమయం లో జేఎన్టీయూ డైరెక్టర్ ఆఫ్ వాల్యూవేషన్ నాగ ప్రసాద్ నాయుడు మే జూన్ నెలలో నిర్వహించిన బీటెక్ ఎంటెక్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా జెయింట్ విశ్వవిద్యాలయ పరిధిలో మే జూన్ నెలలో బీటెక్ ఎంటెక్ ఎంబీఏ ఎంసీఏ తదితర సెమిస్టర్ రెగ్యులర్ సప్లమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేయడం జరిగిందని పూర్తి వివరాల కోసం జేఎన్టీయూ వెబ్సైట్ను కానీ ఎగ్జామినేషన్ అకాడమీ సెక్షన్లు కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని జెఎన్టియు డైరెక్టర్ ఆఫ్ వాల్యూవేషన్ నాగప్రసాద్ నాయుడు తెలిపారు.