మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో మినీ ట్యాంక్ బండ్లో పడి యువకుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. జడ్చర్ల మున్సిపాలిటీలోని 14వ వార్డు మినీ ట్యాంక్ బండ్లో పడి వాల్మీకి నగర్కు చెందిన రాజు మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.