సంతనూతలపాడు: చీమకుర్తి మెప్మా సిటీ మిషన్ మేనేజర్ గా ఉద్యోగ బాధ్యతలను స్వీకరించిన ప్రసాద్
చీమకుర్తి మెప్మాసిటీ మిషన్ మేనేజర్ గా ఏ ప్రసాద్ గురువారం చీమకుర్తిలోని మెప్మా కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు. గిద్దలూరు నుండి బదిలీపై వచ్చిన ఆయన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మెప్మా కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది ప్రసాద్ ను అభినందించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ... పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా పేదలకు ఉపాధి కల్పించి, వారు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తామని తెలిపారు. సెల్ఫ్- హెల్ప్ గ్రూపులకు రుణాలను మంజూరు చేసి వారిని ఆదుకుంటామన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు.