కనిగిరి: జూలై 14 లోపు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని BLO లు పూర్తి చేయాలి: కనిగిరి ఆర్డీవో తోట అజయ్ కుమార్
కనిగిరి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డిఓ తోట అజయ్ కుమార్ బిఎల్వోలు, తహసిల్దార్లు, రెవిన్యూ సిబ్బందితో మంగళవారం సమావేశమయ్యారు. ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం జూలై 14 వరకు జరుగుతుందని, గడువులోపు బిఎల్వోలు కార్యక్రమాన్ని పూర్తి చేయవలసి ఉంటుందని ఆదేశించారు. బిఎల్వోలు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.