కనిగిరి: పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి
కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో కనిగిరి ఎమ్మెల్యే మరియు ఒంగోలు పార్లమెంటు టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలను వేశారు. పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. పిల్లల నిండు జీవితానికి తల్లిదండ్రులు తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలను వేయించాలన్నారు. నేడు పోలియో చుక్కలను వేయించుకోలేని వారు, సోమవారం, మంగళవారం ఇళ్ల వద్దకు వచ్చే వైద్య ఆరోగ్య సిబ్బందిచే పిల్లలకు పోలియో చుక్కలను వేయించాలని సూచించారు.