గిద్దలూరు: కంభం మండలం రావిపాడు గ్రామంలో వర్షాలు కురవాలని అమ్మవారికి బోనాలు సమర్పించిన గ్రామస్తులు
మార్కాపురం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామంలో వర్షాలు కురవాలని గ్రామస్థులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఊరేగింపుగా గ్రామంలో మేల తాళాలతో అమ్మవారి వేషధారణతో గ్రామం మొత్తం ఊరేగించి తర్వాత ఆలయానికి చేరుకొని అక్కడ బోనం సమర్పించారు. కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలో సరైన వర్షాలు లేకపోవడం వల్ల ప్రజలు రైతులు ఇబ్బందులు పడుతున్నారని అందుకే గ్రామంలో అమ్మవారికి బోనం సమర్పించి వర్షాలు కురవాలని కోరుకుంటున్నాను గ్రామస్తులు తెలిపారు.