రాప్తాడు: ఎస్కే యూనివర్సిటీ మరింత అభివృద్ధి చేసేందుకు తన వంతు సహకారం అందిస్తా నూతన అడ్మిషన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీరాములు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఇటికలపల్లి వద్ద ఉన్న శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయంలో బుధవారం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో ఉప కులపతి జ్యోతి కుమార్ ఎస్కే యూనివర్సిటీ అడ్మిషన్ డిప్యూటీ డైరెక్టర్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీరాములు నియమించారు. ఈ సందర్భంగా అడ్మిషన్ డిప్యూటీ డైరెక్టర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీరాములు మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఎస్కే యూనివర్సిటీ అభివృద్ధిలో తన వంతు కృషిని కూడా అందిస్తానని తనకు అడ్మిషన్ డిప్యూటీ డైరెక్టర్ గా అవకాశం కల్పించిన ఉపకులపతి జ్యోతి కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారని అడ్మిషన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీరాములు పేర్కొన్నారు.