కనిగిరి: జ్ఞాన సముపాధ్యనే లక్ష్యంగా విద్యార్థులు ముందుకు సాగాలి: కనిగిరి వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ఎంఈఓ రామిరెడ్డి
కనిగిరి: జ్ఞాన సమపార్జునీ లక్ష్యంగా విద్యార్థులు ముందుకు సాగాలని ఎంఈఓ దేవి రెడ్డి రామిరెడ్డి సూచించారు. కనిగిరి పట్టణంలోని శాఖ గ్రంధాలయంలో గ్రంథ పాలకుడు షరీఫ్ అహ్మద్ అధ్యక్షతన శనివారం విద్యార్థుల వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ఎంఈఓ హాజరయ్యారు. విద్యార్థులు క్రమశిక్షణతో, పట్టుదలతో చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఎంఈఓ సిద్ధించారు. జన విజ్ఞాన వేదిక జాతీయ ఉపాధ్యక్షులు గయాజ్ భాష మాట్లాడుతూ... వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులకు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చిన రిసోర్స్ పర్సన్లను అభినందించారు. శిక్షణ శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.