రాప్తాడు: చీనీ తోట ఎండిపోయిన రైతులను ఆదుకోవాలని అనంతపురం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన రాప్తాడు రైతు సంఘం నేతలు
అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో జిల్లాలో ఎండిపోయిన ఛీని రైతులను ఆదుకోవాలని ఎండిపోయిన చీనీ కాయలతో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా రాప్తాడు ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో నీటి ఎద్దడి కారణంగా చీనీ తోటలు ఎండిపోయి రైతులు ఇబ్బంది గురవుతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం చీని తోట రైతులందరికీ ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .