దేవరుప్పుల: కోలుకొండ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
దేవరుప్పుల మండలం కోలుకొండ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తనిఖీ చేశారు. పాఠశాల వసతులు, మధ్యాహ్న భోజన నాణ్యత, విద్యాబోధనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పరిశుభ్రత, స్వచ్ఛమైన తాగునీరు, క్రీడల ప్రాధాన్యతపై ఉపాధ్యాయులకు కీలక సూచనలు చేశారు.