దేవరుప్పుల: పాలకుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన వికలాంగుల చేయూత పెన్షన్ దారుల నియోజకవర్గ స్థాయి సమావేశానికి హాజరైన మందకృష్ణ మాదిగ
పాలకుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన వికలాంగుల మరియు చేయూత పెన్షన్ దారుల నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వికలాంగులు వృద్ధులు వితంతువులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలో భాగంగా పెన్షన్లను ఎప్పుడు పెంచుతారని ప్రశ్నించారు. పెన్షన్లు పెంచకపోతే గద్దె దింపుతామని హెచ్చరించారు. సెప్టెంబర్ 3న హైదరాబాదులో భారీ సభ నిర్వహించి ప్రభుత్వంతో కొట్లాడి తాడోపేడో తెలుసుకుంటామని అన్నారు. పెన్షన్లు పెంచుతామని మేనిఫెస్టో పెట్టిన రేవంత్ రెడ్డి 20 నెలలు అవుతున్న మర్చిపోయారన్నార