ఉరవకొండ: విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వం అన్ని వసతులు కల్పించబడిన ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చదివించండి
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం బెలుగుప్ప తండా గ్రామంలో బడి పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా ఎన్రోల్మెంట్ డ్రైవ్ ను ఎంఈఓ-1 గోవిందరాజులు హెచ్ ఎం నాగరాజు ఉపాధ్యాయులు హనుమంతు నాయక్ లతో కలిసి బుధవారం గ్రామంలో చేపట్టారు. ఇంటింటా వెళ్లి విద్యార్థులను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అవగాహన కల్పించారు. విద్యార్థులకు అన్ని వసతులను పూర్తిస్థాయిలో ప్రభుత్వం కల్పించిందని వివరించి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు,సీఆర్పీలు బాలకృష్ణ, ఎర్రి స్వామిలతో కలసి దాదాపు13 విద్యార్థులను చేర్చడమైనదిని ఎంఈఓ పేర్కొన్నారు.