సంతనూతలపాడు: డెంగ్యూ వ్యతిరేక మాస ఉత్సవాల సందర్భంగా వైద్యాధికారి మాధవరావు ఆధ్వర్యంలో సంతనూతలపాడులో అవగాహన ర్యాలీ
సంతనూతలపాడు లో డెంగ్యూ వ్యతిరేక మాస ఉత్సవాల సందర్భంగా వైద్యాధికారి సిహెచ్ మాధవరావు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య సిబ్బంది డెంగ్యూ వ్యాధిపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. వైద్యాధికారి మాధవరావు మాట్లాడుతూ... డెంగ్యూ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దోమ కాటు వల్ల డెంగ్యూ వ్యాధి సంభవిస్తుందని, దోమలు కొట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.