ఉరవకొండ: బెళుగుప్పలో వైభవంగా సద్గురు శ్రీ శ్రీ ఎర్రితాత స్వామి ఆరాధన ఉత్సవం. -ఉత్సవాల్లో పోటెత్తిన భక్త జనం
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శాంతి దామంలో సద్గురు శ్రీ శ్రీ ఎర్రితాత స్వామి 90వ ఆరాధన ఉత్సవంలో బుధవారం రాత్రి పది గంటల నుండి స్వామివారి ప్రభోత్సవ ఊరేగింపు, పల్లకి సేవ కార్యక్రమాన్ని భక్తజన సందోహం మధ్య నిర్వహించారు. గ్రామంలోని శ్రీ విగ్నేశ్వర స్వామి దేవాలయం నుండి ప్రారంభమైన ఊరేగింపు లక్ష్మీ నగర్, ఎన్టీఆర్ సర్కిల్, మెయిన్ బజార్, వాల్మీకి సర్కిల్ మీదుగా శాంతి ధామం వరకు కొనసాగిస్తారు. విద్యుత్ దీప కాంతుల మధ్య ప్రబోత్సవ ఊరేగింపు మంగళ వాయిద్యాలు, కోలాటలు, భజనలు చేస్తూ ముందుకు సాగింది.