సంతనూతలపాడు: బడుగు ,బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన బాబు జగ్జీవన్ రామ్ : సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్
సంతనూతలపాడు లోని టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్ ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ఉప ప్రధాని దివంగత బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ చిత్రపటానికి ఎమ్మెల్యే విజయ్ కుమార్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం బాబు జగ్జీవన్ రామ్ ఎంతగానో కృషి చేశారని ఎమ్మెల్యే అన్నారు. కేంద్ర మంత్రిగా, భారతదేశ ఉప ప్రధానిగా బాబు జగ్జీవన్ రావ్ అందించిన సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే కొనియాడారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.