కనిగిరి: మార్కాపురంలో కలెక్టర్ ఎం విజయ సునీతను మర్యాదపూర్వకంగా కలిసిన కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి
కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలను చేపట్టిన ఎం విజయ సునీతను బుధవారం మార్కాపురంలోని కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గం లోని పలు పెండింగ్ సమస్యలను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు.