రాయదుర్గం: స్పీడ్ బ్రేకర్లు వేయాలంటూ హైవేపై ఆందోళనకు దిగిన ఉడేగోళం గ్రామస్తులు, ఉద్రిక్తత
రాయదుర్గం మండలం 74 ఉడేగోళం వద్ద హైవేపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, తక్షణమే స్పీడ్ బ్రేకర్ లు వేయాలని గ్రామస్తులు వందల మంది రోడ్డుపై వచ్చి ఆందోళనకు దిగారు. వాహనాలు అడ్డుకుని రోడ్డు బంద్ చేశారు. పోలీసులు వారికి నచ్చజెప్పేందుకు ప్రయాణం చేసినా ససేమిరా అంటూ ఆందోళన కొనసాగించారు. దీంతో అక్కడ గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. గ్రామస్తుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది.