రాప్తాడు: వైసిపి సోషల్ మీడియా ప్రతినిధులను అక్రమ అరెస్టు చేసి బెదిరిస్తున్నారు అనంతపురంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి
అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గురువారం నాలుగు గంటల 45 నిమిషాల సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గానికి చెందిన గిరీష్ రెడ్డి పై అక్రమంగా కేసు నమోదు చేయడం జరిగిందని అతని అరెస్ట్ చేసి చిత్తూర్ కి తరలించడం జరిగిందని ఈ కేసు నమోదులో ఎమ్మెల్యే పరిటాల సునీత హస్తముందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోషల్ మీడియా ప్రతినిధుల అరెస్టుపై కూటమి ప్రభుత్వం పైన ఎమ్మెల్యే పరిటాల సునీత పై పలు విమర్శలు చేశారు.