కళ్యాణదుర్గం: రాళ్ల అనంతపురంలోని జడ్పీ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం నాణ్యత పై ఎమ్మెల్యే సురేంద్రబాబు మండిపాటు
కంబదూరు మండలం రాళ్ల అనంతపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని మంగళవారం ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనం సరిగా లేదని ఆ పాఠశాలకు చెందిన కొందరు విద్యార్థులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనం నాణ్యతను పరిశీలించారు. భోజనం నాణ్యత లోపించిందని మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులపై మండిపడ్డారు. మరోసారి రిపీట్ అయితే చర్యలు తప్పవని మధ్యాహ్నం భోజనం ఏజెన్సీ నిర్వాహకులను హెచ్చరించారు.