సంతనూతలపాడు: బక్రీద్ పండగను ముస్లింలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి: సంతనూతలపాడు ఎస్సై అజయ్ బాబు
సంతనూతలపాడు మండలంలో బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సంతనూతలపాడు ఎస్సై అజయ్ బాబు ముస్లిం సోదరులకు సూచించారు. బుధవారం సంతనూతలపాడు పోలీస్ స్టేషన్ లో బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులతో ఎస్సై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బక్రీద్ పండగ సందర్భంగా గోవధ చేయరాదని సూచించారు. శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని తెలిపారు. అలాగే నమాజ్ చేసే ఈద్గా వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు..