కనిగిరి: పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ప్రయాణికులకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు: కనిగిరి మున్సిపల్ కమిషనర్ శ్రీధర్
కనిగిరి పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ప్రయాణికులకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కనిగిరి మున్సిపల్ కమిషనర్ పి శ్రీధర్ తెలిపారు. కనిగిరి ఆర్టీసీ డిపోలో ప్రయాణికులకు తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు డీప్ బోర్ నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని ఆర్టీసీ డిపో మేనేజర్ తో కలిసి ఆయన మంగళవారం పరిశీలించారు. మార్కాపురం జిల్లాలోనే కనిగిరి ఆర్టీసీ డిపో అత్యధిక ఆదాయం కలిగిన డిపోగా పేరు పొందిందన్నారు. అటువంటి డిపోకు ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా సాగుతుంటాయని, వారికి తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.