సంతనూతలపాడు: నాగులప్పలపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నవ చేతన కార్యక్రమం పై అవగాహన
నాగులుప్పలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు నవ చేతన కార్యక్రమం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 0 నుండి 6 సంవత్సరాల లోపు చిన్నారుల శారీరక లోపాలను గుర్తించి ప్రభుత్వం నిర్దేశించిన యాప్ లో అంగన్వాడీ కార్యకర్తలు నమోదు చేయాలని ఐసిడిఎస్ సూపర్వైజర్లు సూచించారు. గుర్తించిన శారీరక లోపాలను వైద్యుల పరీక్షల చికిత్సల ద్వారా సరిచేసేలా అంగన్వాడీ కార్యకర్తలు శ్రద్ధ చూపాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల హాజరు శాతాన్ని పెంచాలని సూచించారు.