రాప్తాడు: నాగసముద్రం గ్రామం వద్ద 50 లక్షల రూపాయలు నిర్మించిన రోడ్డును ప్రారంభించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
సత్య సాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండలం నాగసముద్రం గ్రామంలో మంగళవారం సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల సమయంలో నాగసముద్రం నుంచి చందమూరు వరకు నిర్మించిన రోడ్డును రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ నాగసముద్రం నుంచి చందమూరు గ్రామం వరకు 50 లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్డును ప్రారంభించడం జరిగిందని అదే విధంగా గ్రామంలో శ్రీ నాగనాథ స్వామి దేవాలయానికి ధూప దీప నైవేద్యానికి పదివేల రూపాయలు నెలకు మంజూరు చేయించడం జరిగిందని భవిష్యత్తులో ఈ గ్రామ అభివృద్ధికి తాను ఎప్పుడు సహకరిస్తానని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు