సంతనూతలపాడు: మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై చర్యలు: సంతనూతలపాడు ఎస్సై అజయ్ బాబు
సంతనూతలపాడు మండలం మైనంపాడు లో ఎస్సై అజయ్ బాబు రోడ్డు ప్రమాదాల నివారణ పై గురువారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ... 18 సంవత్సరాల లోపు మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులు వాహనాలను ఇవ్వవద్దన్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల వారు ప్రమాదాలకు గురి కావడమే కాకుండా ఎదుటి వ్యక్తులను ప్రమాదాలకు గురి చేస్తున్నారన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.