కొండపి: వైసిపి నాయకులపై మంత్రి స్వామి తీవ్ర అగ్రహం, డీఎస్సీలో అవకతవకలు జరిగాయి అనడంపై అసహనం వ్యక్తం చేసిన మంత్రి
కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు వైసీపీ చేస్తున్న ఆరోపణలు అర్థరహితంగా ఉన్నాయని మంత్రి స్వామి అన్నారు. కొండేపిలో ఆయన మాట్లాడుతూ.. 'మా హయాంలో పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించారు. ఇందులో అక్రమాలు జరిగాయని కోర్టుకు వెళ్లారు. అక్కడ చుక్కెదురు కావడంతో పార్లమెంట్లో ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ నేతలకు మతిభ్రమించి మాట్లాడుతున్నారు. వైసీపీలో లాగా మా పార్టీలో హంతకులు లేరు' అని మంత్రి ఎద్దేవా చేశారు.