ఉరవకొండ: పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతానికి ముందస్తు ఏర్పాట్లు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం
పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతానికి ముందస్తు ఏర్పాట్లు, 0-5 సంవత్సరములు పోలియో చుక్కలు 28.06.2026 ఆదివారం నిండు ప్రాణానికి రెండు చుక్కలను వేయించాలని డాక్టర్ టి. ప్రియాంక, డాక్టర్ రిషికేష్ తెలియజేసినారు. సోమవారం అనంతపురం జిల్లా బెలుగుప్ప పిహెచ్సిలో మండల తహసిల్దార్ అనిల్ కుమార్ ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, మరియు టీడీపీ జిల్లా కార్యదర్శి మల్లికార్జున, మండల కన్వీనర్ సునీల్,, మాజీ సర్పంచ్ రామ్మోహన్ చౌదరి పాల్గొని పల్స్ పోలియో కార్యక్రమాన్ని 100% విజయవంతంగా చేయాలని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి వైద్యాధికారులు సూచించినారు.