ఉరవకొండ: చాబాల గ్రామంలో మాజీ వైస్ ఎంపీపీ నారాయణప్ప గుండెపోటుతో ఆకస్మిక మృతి
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చాబాల గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మాజీ వైస్ ఎంపీపీ నారాయణప్ప(62) శనివారం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడం ఎంతో బాధాకరం అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుని పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి M.అశోక్ కుమార్ పేర్కొన్నారు. మండల పార్టీ అధ్యక్షులు సోమశేఖర్ రెడ్డి జిల్లా బీసీ సెల్ కార్యదర్శి గోవిందు బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు డిష్ సురేష్, నియోజకవర్గ రైతు కమిటీ అధ్యక్షులు సిద్ధప్ప, జిల్లాఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకట్రాముడు లతో కలసి నారాయణప్ప మృతదేహానికి పూలమాలలో వేసి నివాళులు అర్పించారు.