రాప్తాడు: రాప్తాడు మండల కేంద్రంలో రైతు సేవ కేంద్రం వద్ద వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో రైతన్న మీకోసం వారోత్సవాలు నిర్వహించారు
అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో రైతు భరోసా కేంద్ర సిబ్బంది వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో రైతన్న మీకోసం వారోత్సవాలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు రైతు భరోసా సిబ్బంది తదితరులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతన్న మీకోసం కార్యక్రమాన్ని రాప్తాడు మండల కేంద్రంలో నిర్వహించడం జరిగిందని ముఖ్యంగా ఏపీ ఏఐఎంఎస్సి యాప్ ద్వారా డిఎపి ఎరువులు కొనుగోలు చేయాలని పొడి వాతావరణ పరిస్థితులు తగ్గట్టుగా పంటలు వేసుకోవాలని రైతులకు అవగాహన కల్పించడం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.