ఉరవకొండ: ట్రాన్స్ పార్మర్ వద్ద విద్యుత్ షాక్ తో విత్తన పొట్టేలు మృతి. గొర్రెల కాపరులకు తప్పిన పెను ప్రాణపాయం
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద శనివారం సాయంత్రం మేత కోసం వెళ్ళిన విత్తన పొట్టేలు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. అటుగా గొర్రెల కాపరులు వెళ్లకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటనలో సుమారు రూ. 40,000 విలువ చేసే విత్తన పొట్టేలు మృతి చెందిందని బాదిత గొర్రెల కాపరులు ఈశ్వర నాయక్, హనుమంత రాయుడు నాయక్ పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై విద్యుత్ శాఖ మండల ఏ ఈ గంగాధర్ కు ఫిర్యాదు చేశారు.