ఉరవకొండ: పెన్న అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో సింహ వాహనంపై విహరించిన స్వామివారు
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెన్న అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం స్వామివారు సింహవాహణంపై ఆలయం మాడవీధుల్లో విహరించారు. అంతకుముందు ఆలయంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య నృసింహ జయంతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.